కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారిమళ్లిస్తున్నారు: బండి సంజయ్
- కేంద్ర సహకారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు
- అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ఆగ్రహం
- కరోనా టెస్టులు చేయడంలోనూ ప్రభుత్వం విఫలం
కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారంటూ ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.
ఇటు, కరోనా టెస్టులు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వైద్యులు, పాత్రికేయులకు కరోనా నుంచి రక్షణ కల్పించడంలో సర్కారు పనితీరు బాగాలేదని విమర్శించారు. కరోనాతో చనిపోతున్న వారి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 'ఆత్మ నిర్భర్ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.