ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ
- భౌతిక దూరం పాటిస్తూ భేటీ
- 'వైఎస్‌ఆర్ చేయూత' పథకంపై చర్చ
- మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చలు
- ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సమాలోచన
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. భౌతిక దూరం పాటిస్తూ మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, కీలకమైన అంశాలపై మంత్రులతో జగన్ చర్చిస్తున్నారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల కోసం అమలు చేయాల్సిన 'వైఎస్‌ఆర్ చేయూత' పథకంపై వారు చర్చిస్తున్నారు.
రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు సర్కారు సాయం చేసే పథకంపై కూడా వారు చర్చించనున్నారు. రాష్ట్రంలో తీసుకురావాలనుకుంటోన్న మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై కూడా చర్చిస్తారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి.