పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి నన్ను గృహ నిర్బంధం చేసిన్రు: వీడియో పోస్ట్ చేసిన ఉత్తమ్‌

  • కరెంటు బిల్లులకు నిరసనగా ‘చలో సెక్రటేరియట్’కు పిలుపు
  • కాంగ్రెస్ నేతలను హౌస్‌ అరెస్ట్ చేస్తోన్న పోలీసులు
  • మనం పోలీసు రాజ్యంలో ఉన్నమా? అని ఉత్తమ్‌ ఆగ్రహం
  • కేసీఆర్ ఎందుకింత ఉలిక్కిపడుతుండు? అని ప్రశ్న
తెలంగాణలో వినియోగదారులకు వస్తోన్న కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపు చేస్తున్నారు. పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. దీనిపై ఉత్తమ్‌ మండిపడుతూ తన ఇంటి వద్ద ఉన్న పరిస్థితులపై ఓ వీడియో పోస్ట్ చేశారు.

'ఇవాళ పొద్దుటి నుండి పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి నన్ను అకారణంగా గృహ నిర్బంధం చేసిన్రు. మనం పోలీసు రాజ్యంలో ఉన్నమా? ప్రజాస్వామ్యవాదులను చూసి కేసీఆర్ ఎందుకింత ఉలిక్కిపడుతుండు?' అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ట్వీట్ చేశారు.


More Telugu News