ముఖ్యమంత్రి జగన్ గారు, అర్థమవుతుందా?: నిమ్మగడ్డ కేసులో సుప్రీం తీర్పుపై వర్ల రామయ్య ప్రశ్న

  • నిమ్మగడ్డ గారిని కొనసాగించే ప్రక్రియలో మీరు భేషజాలకు పోకండి
  • ఇగో ప్రక్కన పెట్టండి
  • అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించండి 
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడండి 
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించే విషయంలో వైసీపీ సర్కారు కనబర్చుతోన్న తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టులోనూ వైసీపీ సర్కారుకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఆయన ఈ విషయంపై ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

'ముఖ్యమంత్రి గారు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారిని కొనసాగించే ప్రక్రియలో మీరు భేషజాలకు పోకండి. ఇగో ప్రక్కన పెట్టండి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగాన్ని రక్షించండి. రాజకీయ నిర్ణయాలను సమీక్షించడానికే న్యాయవ్యవస్థ. అర్థమవుతుందా?' అంటూ వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.


More Telugu News