అప్పట్లో వాళ్లు నన్ను 'పాకీ' అంటూ దూషించారు: ఆకాశ్ చోప్రా ఆవేదన

  • ఓ సారి జాత్యహంకారానికి గురయ్యాం
  • గతంలో ఇంగ్లాండ్‌లో లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నాం
  • ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 'పాకీ' అంటూ కామెంట్ చేశారు 
  • గోధుమ రంగులో ఉన్న వారిని పాకీ అని పిలుస్తారు
తాము గతంలో ఓ సారి జాత్యహంకారానికి గురయ్యామని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా తెలిపారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ దారుణ మరణం నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఇంగ్లాండ్‌లో లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి జట్టులో ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారని ఆయన చెప్పారు. తాను నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న సమయంలో వారు దూషించారని, పాకీ అంటూ పిలిచారని చెప్పారు.

పాక్‌ను పాకీగా పిలుస్తారని చాలా మంది అనుకుంటారని, కానీ దానికి అర్థం వేరే ఉందని, గోధుమ రంగులో ఉన్న వారిపై, ఆసియా ఉపఖండానికి చెందిన వారిపై వర్ణవివక్ష చూపిస్తూ ఇలా పిలుస్తారని ఆకాశ్ చోప్రా వివరించారు. అప్పట్లో తనపై వివక్ష చూపించిన సమయంలో భారత జట్టు తనకు అండగా నిలిచిందని ఆయన చెప్పారు. ఈ వివక్ష అనేది శ్వేతజాతీయులకు కూడా ఎదురవుతుందని ఆయన చెప్పారు. గతంలో ఆసీస్ క్రికెటర్ సైమండ్స్‌ భారత పర్యటనకు వచ్చిన సమయంలో వాంఖడే స్టేడియంలో ప్రేక్షకులు ఆయనను దూషించారని తెలిపారు.


More Telugu News