డాక్టర్లపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నాం: తెలంగాణ మంత్రి ఈటల
- డాక్టర్లపై దాడులు దురదృష్టకరం
- కఠిన శిక్ష పడేలా చూస్తాం
- జూనియర్ డాక్టర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఆసుపత్రి ఫర్నిచర్‌ను కూడా అతను ధ్వంసం చేయడంతో వైద్యులు నిరసనకు దిగి, సమ్మె చేస్తున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
'డాక్టర్లపై దాడులు దురదృష్టకరం. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. జూనియర్ డాక్టర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఆందోళన విరమించి విధుల్లో చేరుతున్నందుకు ధన్యవాదాలు' అని ఆయన చెప్పారు.