ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోబోతున్నాం.. సిద్ధంగా ఉండండి: గంగూలీ
- టీ20 ప్రపంచకప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోలేకపోతున్న ఐసీసీ
- అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని యోచన
- అన్ని రాష్ట్రాల బోర్డులకు లేఖ రాసిన గంగూలీ
కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌కు రెడీగా ఉండాలంటూ ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ చీఫ్ గంగూలీ లేఖలు రాశాడు. అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే కనుక ఐపీఎల్ నిర్వహించాలని యోచిస్తున్నామని, అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, కాబట్టి బోర్డులు సిద్ధంగా ఉండాలని గంగూలీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆటగాళ్లు కూడా మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నారని అన్నాడు.