వరుసగా ఐదో రోజూ పెట్రో ధరల పెంపు!
- ఐదు రోజుల్లో రూ. 2.74 పెరుగుదల
- గురువారం 60 పైసలు పెరిగిన ధర
- హైదరాబాద్ లో రూ. 76.82కు పెట్రోలు ధర
ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు నిదానంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా ఐదో రోజూ ధరలు పెరిగాయి. గురువారం నాడు లీటరుపై 60 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ఐదు రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ. 2.74 మేరకు పెరిగినట్లయింది.
ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ. 74. డీజిల్ రూ. 72.22కు చేరగా, ముంబైలో పెట్రోల్ రూ. 80.98. డీజిల్ రూ. 70.92కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ. 70.64కు పెరుగగా, బెంగళూరులో పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66కి, హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 76.82. డీజిల్ రూ. 70.59కు, అమరావతిలో పెట్రోల్ రూ. 77.36. డీజిల్ రూ. 71.18కు చేరుకున్నాయి.