కరోనా పోతుందంటూ... ఝార్ఖండ్ లో 400 గొర్రెలను బలిచ్చారు!
- కొడెర్మా జిల్లాలో ఘటన
- బలితో కరోనా పోతుందని నమ్మిన గ్రామస్థులు
- విషయం తెలుసుకుని అధికారుల చర్యలు
కరోనా వైరస్ పోవాలంటూ ఝార్ఖండ్ లోని ఓ గ్రామవాసులు 400 గొర్రెలను గ్రామ అమ్మవారి ఆలయంలో బలిచ్చారని తెలిసింది. ఈ ఘటన కొడెర్మా జిల్లాలోని చంద్వారా బ్లాక్ పరిధిలో ఉన్న ఉర్వాన్ గ్రామంలో జరిగింది. కరోనా మహమ్మారి బారి నుంచి తమ గ్రామానికి రక్షణ కలుగుతుందన్న నమ్మకంతోనే ఈ పని చేశామని, తాము గ్రామ దేవతను నమ్ముతాము కాబట్టే గొర్రెలను బలిచ్చామని గ్రామస్థులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.