తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 4 వేల మార్కును దాటేసిన వైనం!

  • జీహెచ్ఎంసీ పరిధిలో 143 కేసుల నమోదు
  • 4,111కు చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • ఇప్పటి వరకు 156 మంది మృతి
తెలంగాణలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. రోజురోజుకు వందల్లో పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 191 కేసులు నమోదయ్యాయి. అలాగే, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,111కి చేరుకోగా, 156 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూసిన వాటిలో 143 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మేడ్చల్‌, సంగారెడ్డిలో 11 చొప్పున, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌లో మూడు చొప్పున కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌లో రెండేసి, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్ధిపేటలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,817 మంది డిశ్చార్జ్ కాగా, 2,138 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
.


More Telugu News