ఫామ్ హౌస్ విషయంలో.. కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట

  • కేటీఆర్ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి పిటిషన్
  • కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన గ్రీన్ ట్రైబ్యునల్
  • ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
టీఎస్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే జువ్వాడలో ఉన్న ఫామ్ హౌస్ వ్యవహారంలో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి  తెలిసిందే. జీవో 111కు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ ను నిర్మించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. దీంతో, కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, పీసీబీ, హెచ్ఎండీఏలకు కూడా నోటీసులు ఇచ్చింది.

దీనికి తోడు ఒక నిజ నిర్ధారణ కమిటీని ఎన్జీటీ నియమించింది. రెండు నెలల్లోగా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈనేపథ్యంలో హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.


More Telugu News