సుప్రీం వ్యాఖ్యలతో.. ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కును కోల్పోయింది: సోమిరెడ్డి
- ఎలెక్షన్ కమిషనర్ తొలగింపును తప్పుపట్టిన సుప్రీంకోర్టు
- ఆర్డినెన్స్ వెనకున్న ఉద్దేశాలు తృప్తిగా లేవని వ్యాఖ్య
- రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారితో ఆటలు వద్దని వ్యాఖ్య
రాష్ట్ర ఎన్నికల అధికారి పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వెనకున్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారితో ఆటలు వద్దని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఎలెక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగినదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని హెచ్చరించడం రాష్ట్ర ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టిందని సోమిరెడ్డి అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశాక... ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని వ్యాఖ్యానించారు.