చైనా విషయంలో ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?: రాహుల్ గాంధీ
- చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించింది
- ప్రధాని తెరమీది నుంచి అదృశ్యమయ్యారు
- చైనా-భారత్ భేటీలో చైనా కఠిన వైఖరి అవలంబించింది
లడఖ్‌లో భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ఆర్మీ ఆ ప్రాంతంలోని కొంత భాగాన్ని ఆక్రమించుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని తెరమీది నుంచి అదృశ్యమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల చైనా-భారత్ అగ్రశేణి కమాండర్ల భేటీలో చైనా కఠిన వైఖరి అవలంబించిందని, పలు ప్రాంతాలు తమవేనని వాదించిందని వచ్చిన వార్తా కథనాలను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. లడఖ్‌లో చైనా తీరుతో పాటు సరిహద్దుల్లో జరుగుతోన్న పరిణామాలపై భారత ప్రభుత్వం పారదర్శకంగా వివరాలు తెలపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.