చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేసి.. సందేశం ఇచ్చిన బాలయ్య
- బసవతారకం ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుక
- కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలన్న బాలయ్య
- వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపు
- ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉందని వ్యాఖ్య
హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పిల్లలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...ఆసుపత్రి సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. వారు గొప్ప సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని చెప్పారు.
త్వరలోనే కరోనా అంతమొందాలని బాలకృష్ణ ఆశించారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే, వారు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉందని తెలిపారు.