ఇంట్లోంచి ఇలా విద్యార్థులకు రసాయన శాస్త్ర పాఠాలు చెప్పిన టీచర్!
- మహారాష్ట్రలోని పుణెకు చెందిన టీచర్
- ముక్కాలిపీట లేకపోవడంతో ఓ హ్యాంగర్‌ను వినియోగించిన వైనం
- దాని మధ్య స్మార్ట్‌ఫోన్ అమర్చి పాఠాలు
కరోనా వైరస్ వల్ల విద్యా సంస్థలన్నీ ఆన్లైన్ క్లాసుల నిర్వహణ దిశగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పుణెకు చెందిన మౌమిత అనే టీచర్ ఇంట్లోంచి సెల్‌ఫోన్ ద్వారా చెప్పిన ఆన్లైన్ కాస్లులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆమె వద్ద ముక్కాలిపీట లేకపోవడంతో ఓ హ్యాంగర్‌ను వినియోగిస్తూ ఇలా దాని మధ్య స్మార్ట్‌ఫోన్ అమర్చి పాఠాలు చెప్పింది.
స్మార్ట్‌ఫోన్ అటూ ఇటూ కదలకుండా దాన్ని పైన కింద గట్టిగా కట్టేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఇటీవల పోస్ట్ చేయడంతో దీనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంట్లో బోర్డుపై చాక్‌పీస్‌తో ఆమె రసాయన శాస్త్ర పాఠాలు చెబుతూ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా విద్యార్థులకు వాటిని అందించింది. మంచి సంకల్పం వుంటే కనుక ఏదైనా చేయవచ్చని పేర్కొంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.