ఒక్క ఏడాదిలో సంక్షేమ పథకాలకు రూ.42,465 కోట్లు ఖర్చుచేశాం: సీఎం జగన్ వివరణ
- 'జగనన్న చేదోడు' పథకం ప్రారంభం
- లబ్దిదారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
- బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామన్న సీఎం
- కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా పథకాలు వర్తింపజేస్తాం
దుకాణాలు ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం 'జగనన్న చేదోడు' పథకాన్ని ప్రారంభించింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఈ సందర్భంగా లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు వేస్తామని చెప్పారు.
ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా 2,47,040 మందికి మొత్తం రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా అర్హులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
ఎవరికైనా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరకపోతే వారు గ్రామ, వార్డు సచివాలయాలకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని జగన్ సూచించారు. అర్హులందరికీ సాయం చేస్తామని చెప్పారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. తాము ఒక్క ఏడాదిలో సంక్షేమ పథకాలకు రూ.42,465 కోట్లు ఖర్చుచేశామన్నారు.