దేశంలో కరోనా ఉద్ధృతి మామూలుగా లేదు.. హిందుస్థాన్‌ టైమ్స్‌ అధ్యయనంలో వెల్లడి

  • గత నెలలోనే దేశంలో 1,53,000 కేసులు 
  • లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించిన నేపథ్యంలో ఉద్ధృతి
  • 9 రోజుల్లో 76,000 కన్నా అధికంగా కరోనా కేసులు
  • గత 40 రోజుల్లో 86 శాతం కరోనా వైరస్ కేసులు  
దేశంలో కరోనా వైరస్‌ తీవ్రతరమైంది. ఈ నెల 1 నుంచి దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించిన నేపథ్యంలో కరోనా ఉద్ధృతి మరింత పెరిగిందని  కేసుల గణాంకాలపై జాతీయ మీడియా హిందూస్థాన్ టైమ్స్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 9 రోజుల్లో 76,000 కన్నా అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 40 రోజుల్లో 86 శాతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని వెల్లడైంది.

నమోదైన మొత్తం మరణాల్లో గత 40 రోజుల్లోనే 84 శాతం మరణాలున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా దేశంలోని పలు రంగాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. దీంతో జన సంచారం అధికమై కరోనా వ్యాప్తి మరింత పెరిగింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బృందాలను నియమించి, పలు జిల్లాల్లో వైరస్ కేసులు పెరగడానికి గల కారణాలను అధ్యయనం చేయిస్తోంది.


More Telugu News