ఇండియాలో తొలిసారి... చికిత్స కేసులను దాటేసిన రికవరీలు!

  • మొత్తం కేసుల సంఖ్య 2,76,583 
  • చికిత్స తరువాత రికవరీ అయిన 1,35,206
  • ప్రస్తుతం ఐదో స్థానంలో ఇండియా
రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న భారతీయులకు ఇది ఓ భారీ ఊరట. ఇండియాలో తొలిసారిగా చికిత్స పొందుతున్న కరోనా కేసుల సంఖ్యను రికవరీలు దాటేశాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 9,985 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,76,583కు చేరింది. ఇదే సమయంలో ఇంతవరకూ 1,35,206 మంది రికవరీ అయ్యారు. ఇదే సమయంలో 1.33 లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ తొలి కేసు వచ్చిన తరువాత రికవరీల సంఖ్య 50 శాతం దాటడం ఇదే ప్రథమం.

ఇంతవరకూ ఇండియాలో 7,745 మంది వైరస్ సోకి మరణించగా, 279 మంది గడచిన 24 గంటల్లో చనిపోయారు. ప్రస్తుతం ఇండియా మొత్తం కేసుల సంఖ్య విషయంలో ఐదో స్థానంలో ఉంది. ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే దేశాలు కొనసాగుతున్నాయి. ఇండియాలో కరోనాకు అతిపెద్ద హాట్ స్పాట్ గా ఉన్న మహారాష్ట్రలో సమూహ వ్యాప్తి లేదని ఆ రాష్ట్ర వైద్య మంత్రి రాజేశ్ తోపే వ్యాఖ్యానించారు.


More Telugu News