"ఎదుటివాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో!"... కొత్త చిత్రం టీజర్ లో బాలకృష్ణ గర్జన
- బాలయ్య, బోయపాటి కాంబోలో మూడో చిత్రం
- రేపు బాలయ్య జన్మదినం
- ఈ సాయంత్రమే టీజర్ రూపంలో కానుక అందించిన వైనం
చెప్పిన సమయానికే బాలకృష్ణ కొత్త చిత్రం టీజర్ ఆన్ లైన్ లో రిలీజైంది. బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్ లో సింహ, లెజెండ్ తర్వాత వస్తున్న ఈ మూడో చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే ఆ అంచనాలకు దీటుగానే ఉందన్న విషయాన్ని అభిమానులు గుర్తిస్తారు. "ఎదుటివాడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో!"... అంటూ బాలయ్య రౌద్రం ప్రదర్శించడాన్ని ఈ టీజర్ లో చూడొచ్చు. బోయపాటి మార్కు ఎక్కడా మిస్ కాలేదన్న విషయాన్ని ఈ కాస్త టీజర్ తోనే వివరించారు. మొత్తమ్మీద బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సరైన కానుకే వచ్చిందని చెప్పవచ్చు.