'నేకెడ్' చిత్రానికి టికెట్ రూ. 100 కాకుండా రు. 200 వసూలు చేయడానికి కారణం ఇదే: వర్మ
- ఇప్పటి వరకు రూ. 3 కోట్లకు పైగా వసూలు చేసిన 'క్లైమాక్స్'
- 'నేకెడ్' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వర్మ
- యూట్యూబ్ లో భారీ వ్యూలను సాధిస్తున్న 'నేకెడ్'
టాలీవుడ్ సినీ దర్శకుడు వర్మ తెరకెక్కించిన 'క్లైమాక్స్' చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా ఈ చిత్రం రూ. 3 కోట్లకు పైగా వసూలు చేసి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇదే ఊపులో మరో అడల్ట్ కంటెంట్ మూవీ 'ఎన్ఎన్ఎన్ (నేకెడ్)' విడుదలకు వర్మ సన్నాహకాలు చేస్తున్నారు.
అయితే 'క్లైమాక్స్' చిత్రానికి టికెట్ ధర రూ. 100 కాగా.. 'నేకెడ్' చిత్రానికి ధర రూ. 200 చేశారు. దీనికి వర్మ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. 'విదేశీ మహిళల కంటే భారతీయ మహిళలకు రెండింతలు గౌరవం ఇస్తాను. అందుకే టికెట్ ధర డబుల్ అయింది' అని వర్మ తెలిపారు. మరోవైపు 'నేకెడ్' చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో భారీ వ్యూలను సాధిస్తోంది.