పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులకు బాలకృష్ణ లేఖ
- రేపు బాలయ్య పుట్టినరోజు
- అభిమానులకు బహిరంగ లేఖ
- అభిమానుల ఆరోగ్యమే తనకు ముఖ్యమని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ రేపు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. తన జన్మదినాన్ని తమ ఇంటి పండుగలా జరుపుకుంటూ, కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ లేఖ ప్రారంభించారు.
అయితే, ఈసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అభిమానులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోతున్నానని, అభిమానుల ఆరోగ్యం గురించి ఆలోచించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, భౌతికదూరం పాటించడం అందరి కర్తవ్యం అని, అందుకే పుట్టినరోజు నాడు అందరినీ కలవాలన్న ఆకాంక్షకు అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాలయ్య విచారం వ్యక్తం చేశారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాను నటిస్తున్న చిత్రం టీజర్, తాను పాడిన పాట రిలీజ్ ఈ సాయంత్రం రిలీజ్ అవుతున్నాయని, వాటిని ఆస్వాదించి తనను ఆశీర్వదించాలని కోరారు.