గాంధీ విగ్రహాన్ని పాడుచేయడం అవమానకరం: ట్రంప్
- జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికాలో అల్లర్లు
- వాషింగ్టన్ లో గాంధీ విగ్రహానికి రంగు పులిమిన ఆందోళనకారులు
- ఘటనపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి కొందరు నిరసనకారులు రంగు పులిమారు. విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లుప్తంగా స్పందించారు. ఘటన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఇది అవమానకరమైన చర్యగా పేర్కొన్నారు.
కాగా, విగ్రహాన్ని కొందరు వ్యక్తులు అపవిత్రం చేశారంటూ భారత రాయబార కార్యాలయం వాషింగ్టన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు అమెరికా ప్రభుత్వానికి కూడా ఘటనపై వివరాలు అందించింది. దాంతో అమెరికా ప్రభుత్వం భారత్ ను క్షమాపణలు కోరింది. అమెరికా చట్ట సభల సభ్యులు కూడా గాంధీ విగ్రహంపై దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి ఘటనలు విచారకరం అంటూ ట్రంప్ సలహాదారు కింబర్లీ గిల్ ఫోయిల్ ట్వీట్ చేశారు.