ఇది నన్ను చాలా బాధించింది: యాంకర్ అనసూయ
- కరోనాతో మృతి చెందిన హైదరాబాద్‌కు చెందిన ఓ యువ జర్నలిస్ట్
- మృతి చెందిన ఆ జర్నలిస్టు తనకు తెలుసన్న అను
- ధైర్యంగా పనిచేసే ఎంతో మంది జర్నలిస్టులు నాకు తెలుసు
- ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పిలుపు
కరోనా సోకడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ యువ జర్నలిస్ట్ మృతి చెందడంపై యాంకర్, సినీనటి అనసూయ భావోద్వేగభరిత ట్వీట్ చేసింది. ఇది తనను చాలా బాధించిందని ఆమె పేర్కొంది. కరోనాతో మృతి చెందిన ఆ జర్నలిస్టు తనకు తెలుసని ఆమె తెలిపింది. ధైర్యంగా పనిచేసే ఎంతో మంది జర్నలిస్టులు తనకు తెలుసని ఆమె పేర్కొంది. తాను ఇకపై ఎవరి గురించీ ఇలాంటి వార్త వినాల్సి రాకూడదని అనుకుంటున్నట్లు తెలిపింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో తాను అందరి గురించి ఆందోళన చెందుతున్నానని ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరు కరోనా గురించి జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరింది. కాగా, హైదరాబాద్‌లోని మాదన్నపేటకు చెందిన ఓ జర్నలిస్టు ఈ నెల 1న కరోనాతో మృతి చెందాడు. ఆయన పలు టీవీ ఛానళ్లలో క్రైమ్ రిపోర్టుగా పనిచేశాడు. విధులకు వెళ్తోన్న జర్నలిస్టులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది.