బార్లలో ఉన్న మద్యాన్ని ఇలా అమ్మేయండి: ఏపీ ప్రభుత్వం
- బార్లకు ఇంకా లభించని అనుమతి
- బాటిల్స్ స్టాక్ ఉండటంతో యజమానులకు నష్టాలు
- రీటెయిల్ షాపుల్లో అమ్ముకునేందుకు బార్లకు అనుమతి
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోతున్నాయి. అన్ని వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే వైన్ షాపులు పునఃప్రారంభమయ్యాయి. అయితే, సోషల్ డిస్టెన్స్ నేపథ్యంలో, బార్లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో, బార్లలో ఉన్న మద్యం బాటిళ్లు అలాగే మిగిలిపోయాయి. దీనివల్ల బార్ల యజమానులు నష్టపోతున్నారు. అంతేకాదు, కాలపరిమతి దాటితే బీర్లు పాడైపోయే అవకాశం కూడా వుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పించింది.
బార్లలో స్టాక్ ఉన్న మద్యం బాటిళ్లను రీటెయిల్ ఔట్ లెట్లలో విక్రయించుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. అయితే సీల్డ్ బాటిళ్లను మాత్రమే అమ్మాలని షరతు విధించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బార్ల యజమానులకు ఊరట లభించినట్టయింది.