తెలంగాణ బాటలో తమిళనాడు... పదో తరగతి పరీక్షలు రద్దు
- ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు ఊరట కల్పించిన తెలంగాణ
- కరోనా విజృంభణ నేపథ్యంలో తమిళనాడు కూడా కీలక నిర్ణయం
- పరీక్షలు లేకుండానే పై తరగతికి వెళ్లే వెసులుబాటు
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తెలంగాణ బాటలోనే తమిళనాడు కూడా నడిచింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నేరుగా తర్వాతి తరగతికి ప్రమోట్ అవుతారని పళనిస్వామి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. ఇక, 11వ తరగతికి సంబంధించి ఇంకా జరగాల్సి ఉన్న మిగిలిన సబ్జెక్టుల పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు అక్కడి సర్కారు ప్రకటించింది.