గవర్నర్ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు పెను సమస్యలు సృష్టిస్తుంది: అరవింద్ కేజ్రీవాల్

  • ఢిల్లీ వాసులకే చికిత్స అంటూ ఇంతక్రితం స్పష్టంచేసిన కేజ్రీవాల్
  • సీఎం నిర్ణయంతో విభేదించిన లెఫ్టినెంట్ గవర్నర్
  • గవర్నర్ నిర్ణయం పట్ల ఆందోళన వెలిబుచ్చిన కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో బయటి వారికి చికిత్స అందించలేమని సీఎం కేజ్రీవాల్ ప్రకటించగా, అందరినీ సమానంగా చూస్తామని, స్థానికేతరుడు అనే కారణంతో ఎవరూ చికిత్సకు దూరం కారాదన్నది తమ విధానం అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని గవర్నర్ వ్యతిరేకించడం పట్ల కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలకు పెను సమస్యగా పరిణమిస్తుందని, ఓ సవాల్ గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

"కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో దేశం నలుమూలల నుంచి వస్తున్న వారికి చికిత్స అందించడం ఓ పెద్ద సవాల్. దేశ ప్రజలందరికీ మేం చికిత్స అందించాలంటే ఆ దేవుడు దీవించాల్సిందే. అందరికీ చికిత్స అందించేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తాం" అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


More Telugu News