ఇక తనకు రాజకీయ జీవితం లేదని లోకేశ్ ఈ ప్రెస్ మీట్ పెట్టారు: వైసీపీ నేత పార్థసారథి

  • టీడీపీలో లోకేశ్ కు పోటీ ఎదురైందన్న పార్థసారథి
  • అజ్ఞానాన్నంతా పోగేసి పుస్తకం తెచ్చాడని ఎద్దేవా
  • దిశ బిల్లుకు, యాక్ట్ కు తేడా తెలియదంటూ వ్యంగ్యం
వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ చార్జిషీట్ విడుదల చేయడంపై వైసీపీ నేత పార్థసారథి ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ తో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసరడంపై పార్థసారథి తీవ్రంగా స్పందించారు. టీడీపీలో అధ్యక్ష స్థానానికి లోకేశ్ కు పోటీ ఎదురైనట్టుందని, అందుకే హడావుడిగా వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టారని ఆరోపించారు.  ఇక తనకు రాజకీయ జీవితం లేదని భావించి లోకేశ్ మీడియా ముందుకు వచ్చినట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

"నాన్నారూ, నాన్నారూ నాకూ ఒక చాన్స్ ఇవ్వరా" అంటూ తన అజ్ఞానాన్నంతా పోగేసి ఈ పుస్తకం రూపొందించారని ఎద్దేవా చేశారు. "చర్చకు సిద్ధమా అంటున్నాడు. ఇవాళ మేం చాలెంజ్ చేస్తున్నాం. నువ్వు ఓడిపోయిన మంగళగిరిలో అయినాసరే, మీ నాన్న గెలిచిన కుప్పంలో అయినా సరే. వైఎస్ జగన్ ఏడాది పాలనపై చర్చిద్దాం. ఇప్పుడు గనుక చర్చకు రాకపోతే మీరు తోక ముడుచుకుని పారిపోయారని ప్రజలు భావిస్తారు. దిశ చట్టం బిల్లుకు, యాక్ట్ కు తేడా తెలియని అజ్ఞాని లోకేశ్" అంటూ మండిపడ్డారు.


More Telugu News