టైమ్, ప్లేస్ చెబితే... ఎప్పుడైనా నేను రెడీ: సీఎం జగన్ కు నారా లోకేశ్ సవాల్

  • సీఎం జగన్ కు లోకేశ్ సవాల్
  • ఏడాది పాలనపై చర్చకు రావాలన్న లోకేశ్
  • వైసీపీ ఏడాది పాలనపై చార్జిషీట్
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లోకేశ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో ఆప్యాయత చూపించిన జగన్ రెడ్డి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. గెలవకముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించి, ఇప్పుడు షరతులు వర్తిస్తాయంటున్నారని మండిపడ్డారు. అవ్వా, తాతా అంటూ పెన్షన్ల విషయంలోనూ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ట్వీట్లు చేస్తుంటేనే వైసీపీ నేతల్లో వణుకు కనిపిస్తోందని, ఇక తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే పరిస్థితి ఎలావుంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. జగన్ సర్కారు ఏడాదిపాలనపైనే కాదు, ఏ అంశంపై అయినా తాను చర్చకు సిద్ధం అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. సీఎం జగనే టైమ్, ప్లేసు నిర్ణయించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ సీఎం జగన్ ఏడాది పాలనపై 'చార్జిషీట్' పేరిట ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడాది అయ్యిందని వ్యంగ్యంగా అన్నారు. 


More Telugu News