వర్మ, మియా మాల్కోవా సినిమా 'క్లైమాక్స్'.. తొలి 12 గంటల వసూళ్లు ఎంతంటే..?
- ఓటీటీలో విడుదలైన 'క్లైమాక్స్' చిత్రం
- తొలి 12 గంటల్లో 1.68 లక్షల మంది వీక్షణ
- ఏకంగా రూ. 1.6 కోట్ల వసూళ్లను రాబట్టిన వైనం
లాక్ డౌన్ టైమ్ లో కూడా పనులు చక్కబెట్టిన ఏకైక సినీ ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే... అది రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ సైలెంట్ గా ఎవరింటికి వారు పరిమితమై ఉంటే... వర్మ మాత్రం దూసుకుపోయాడు.
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో లాక్ డౌన్ కు ముందు తెరకెక్కించిన 'క్లైమాక్స్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ... ఆర్జీవీ వరల్డ్ / శ్రేయాస్ మీడియా యాప్ లో విడుదల చేశారు. అంతేకాదు, కరోనాపై లాక్ డౌన్ సమయంలోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించి అందరినీ షాక్ కు గురి చేశారు. ఇప్పుడు తాజాగా నగ్నత్వంతో కూడిన 'ఎన్ఎన్ఎన్' చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.
థియేటర్లన్నీ మూతపడిన సమయంలో.. ఆన్ లైన్లో వర్మ విడుదల చేసిన 'క్లైమాక్స్' చిత్రం తొలిరోజు ఫుల్ సక్సెస్ అయింది. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి రూ. 100 టికెట్ ధరను నిర్ణయించారు. జీఎస్టీ తదితర వాటితో కలిపి రూ. 130 వరకు ఉంది. ఈ చిత్రాన్ని తొలి 12 గంటల్లో ఏకంగా 1,68,596 మంది చూశారు. అంటే తొలి 12 గంటల్లో దాదాపు రూ. 1.6 కోట్లను వసూలు చేసిందన్నమాట. వాస్తవానికి తొలి రోజున రూ. 50 లక్షల కలెక్షన్స్ రావచ్చని వర్మ అంచనా వేశారు. అయితే, అంచనాలను మించి వసూళ్లు రావడంతో.. ఇండస్ట్రీకి కొత్త ఊపు వచ్చినట్టైంది.