కేసీఆర్ సంచలన నిర్ణయం.. పరీక్షలు లేకుండానే 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పాస్!

  • పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన టీఎస్ ప్రభుత్వం
  • ఇంటర్నల్స్, అసెస్ మెంట్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్
  • త్వరలోనే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై నిర్ణయం
కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను పూర్తిగా రద్దు చేసేశారు. పరీక్షలతో సంబంధం లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇంటర్నల్స్, అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మొత్తం 5,34,903 మంది విద్యార్థులు తదుపరి క్లాసులకు వెళ్లనున్నారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడులను నిర్ణయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్ తొలగిపోయింది. మరోవైపు, డీగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, పరీక్షల సందర్భంగా విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యులెవరని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో, పరీక్షలను నిర్వహించడం కంటే... విద్యార్థులను ప్రమోట్ చేయడం ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది.


More Telugu News