హోం క్వారంటైన్ లో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

  • కరోనాతో విలవిల్లాడుతున్న కోనసీమ
  • ఒక వైసీపీ నేత కారణంగా 16 మందికి కరోనా
  • నాలుగు గ్రామాలను కంటైన్మెంట్ చేసిన అధికారులు
కనువిందు చేసే పచ్చదనంతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు కరోనా కాటుకు విలవిల్లాడుతోంది. కోనసీమలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ శిబిరంలో కరోనా కలకలం రేపుతోంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలేనికి చెందిన ఓ వైసీపీ నేత కారణంగా ఇప్పటి వరకు 16 మందికి కరోనా సోకింది. దీంతో, నాలుగు గ్రామాలను అధికారులు కంటైన్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసిన వారు, ఆయన కలిసిన వారు హోం క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ... ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాను స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నానని... తనను ఎవరూ కలిసేందుకు రావద్దని ఆయన విన్నవించారు.


More Telugu News