ఇలాంటి దుష్టులను ట్విట్టర్ ఎందుకు కాపాడుతుందో అర్థం కావడంలేదు: మీరా చోప్రా
- జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మీరా చోప్రాకు వివాదం
- మహేశ్ బాబు అంటే ఇష్టమన్న మీరా
- అప్పట్నించి మీరాపై ట్రోలింగ్
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, నటి మీరా చోప్రాకు మధ్య ట్విట్టర్ లో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ గురించి పెద్దగా తెలియదని, మహేశ్ బాబు అంటేనే ఇష్టమని ఓ లైవ్ చాట్ లో మీరా చోప్రా వ్యాఖ్యానించడంతో రగడ మొదలైంది. దాంతో ఆమెపై ట్రోలింగ్ కు తెరలేపారు. ఈ నేపథ్యంలో, తనపై వేధింపులకు పాల్పడుతున్నారని, తనను బెదిరిస్తున్నారని మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, తాజాగా ట్విట్టర్ ఇండియా విభాగంపై మీరా చోప్రా ధ్వజమెత్తింది.
ఈ ఘటనలో తప్పుచేసినవాళ్ల వివరాలు బయటికి రానివ్వకుండా ట్విట్టర్ ఇండియా, ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి కాపాడుతున్నారని ఆరోపించారు. అసభ్యంగా ట్వీట్లు చేసిన వారి వివరాలు వెల్లడించాలంటూ హైదరాబాద్ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసినా ట్విట్టర్ ఇండియా పెడచెవిన పెడుతోందని మీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్టులను ట్విట్టర్ ఇండియా ఎందుకు కాపాడుతుందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.