పొరపాటున మెగాస్టార్ చిరంజీవి ఫొటో పెట్టి.. నివాళి అర్పించిన శోభా డే.. తీవ్ర విమర్శలు!
- నిన్న మృతి చెందిన కన్నడ హీరో చిరంజీవి సర్జా
- మెగాస్టార్ చిరంజీవిగా భావించి, సంతాపం ప్రకటించిన శోభా డే
- కాసేపటి తర్వాత ట్వీట్ ను తొలగించిన వైనం
ప్రముఖ నవలా రచయిత్రి, కాలమిస్టు శోభా డే తాను చేసిన చిన్న పొరపాటుకు పెద్ద ఎత్తున ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జా నిన్న మృతి చెందారు. 39 ఏళ్ల వయసున్న చిరంజీవి సర్జా గుండెపోటు కారణంగా బెంగళూరులో నిన్న చనిపోయారు. ఆయన మరణంపై దేశ వ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. శోభా డే కూడా ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆవేదనను వ్యక్త పరిచారు.
'మరో ధ్రువతార నేలకొరిగారు. పూడ్చుకోలేని లోటు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే, చిరంజీవి సర్జాను మెగాస్టార్ చిరంజీవిగా ఆమె పొరపాటు పడ్డారు. ట్విట్టర్ ద్వారా ఎంతో ఆవేదనను వ్యక్తపరిచిన ఆమె... మెగాస్టార్ ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాసేపటి తర్వాత పొరపాటును గ్రహించిన ఆమె... ట్వీట్ ను తొలగించారు.