కుప్పకూలిన ట్రైనింగ్ విమానం ఇద్దరి మృతి!
- ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలో ఘోర ప్రమాదం
- విమానం కుప్పకూలడంతో ట్రైనర్, విద్యార్థి దుర్మరణం
- కరోనా నేపథ్యంలో ఈనెల 1వ తేదీన తెరుచుకున్న అకాడమీ
ఒడిశాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ట్రైనింగ్ విమానం కుప్పకూలడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన డెంకనాల్ జిల్లాలోని కనకదాహదాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ విమానయాన శిక్షణా సంస్థ విమానం శిక్షణ కోసం బయల్దేరింది. ఈ విమానంలో శిక్షకుడితో పాటు మహిళా పైలట్ (విద్యార్థి) ఉన్నారు. టేకాఫ్ అయిన 6 నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదస్థలికి డెంకనాల్ ఎస్పీ, ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. శకలాలను తొలగించి మృత దేహాలను వెలికి తీశారు. మరోవైపు ఈ ఏవియేషన్ అకాడమీ కరోనా కారణంగా రెండున్నర నెలల పాటు నిలిచిపోయింది. జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమయింది. మొత్తం 90 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండగా... రోజుకు 36 మందిని శిక్షణ విమానంలో తీసుకెళ్లి, ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో అకాడమీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.