చంద్రబాబుతో ఎంతకాలం నుంచి ఉన్నామో, ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు: కరణం సంచలన వ్యాఖ్యలు
- టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడి
- ఎంతమంది వెళతారన్న
- దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్న కరణం
- జగన్ ను నమ్మితే న్యాయం జరుగుతుందంటూ వ్యాఖ్యలు
టీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసని, ఎంత ఇబ్బంది పడ్డామో కూడా తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వైఖరికి, జగన్ వ్యవహారశైలికి ఎంతో తేడా ఉందని, జగన్ ను నమ్మినవాళ్లకు తప్పకుండా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జగన్ తండ్రి వైఎస్ తోనూ తమకు సన్నిహిత సంబంధాలుండేవని కరణం గుర్తుచేసుకున్నారు.
వెలుగొండ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు అసంపూర్తిగా ఉందని, అది తమ వైఫల్యం కాదని అన్నారు. వెలుగొండ విషయంలో ఎంతో ఒత్తిడి తెచ్చినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇక, వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారని, అయితే ఎంతమంది వస్తారన్నది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. 10 మందో, 12 మందో చెప్పలేను కానీ... కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వైసీపీలో చేరాలని భావిస్తున్నారని వివరించారు. వారు సీఎం జగన్ తోనూ, ఇతర వైసీపీ ముఖ్యనేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదని, మరికొన్నాళ్ల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని కరణం పేర్కొన్నారు.