దేశ వ్యాప్తంగా తెరుచుకున్న దేవాలయాలు.. తరలివస్తోన్న భక్తులు.. ఫొటోలు ఇవిగో
- కొన్ని చోట్ల సిబ్బంది, స్థానికులతో ట్రయల్స్
- పలు దేవాలయాల్లో భక్తులకు అనుమతి
- చారిత్రక కట్టడాల్లోని మొత్తం 820 దేవాలయాలు కూడా ప్రారంభం
లాక్‌డౌన్ సడలింపులతో దేశ వ్యాప్తంగా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి. అలాగే, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని చారిత్రక కట్టడాల్లోని మొత్తం 820 దేవాలయాలు కూడా ఈ రోజు తెరుచుకున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని వేయి స్తంభాల ఆలయంతో పాటు ములుగు జిల్లాలోని రామప్ప, జోగులాంబ గద్వాల జిల్లాలోని నవబ్రహ్మ, పాపనాశి, సంగమేశ్వర ఆలయాలు కూడా తెరుచుకున్నాయి.
దేశంలోని పలు ప్రధాన ఆలయాల్లో భక్తులను అనుమతించకుండా నేడు, రేపు ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే ఆలయాల నిర్వాహకులు, అధికారులకు ఆదేశాలు అందాయి.
ఢిల్లీలోని కన్నాట్ లోని చాలా రోజుల తర్వాత తెరుచుకున్న ఆ ఆలయంలో భక్తులు సందడి చేశారు. ఓ వ్యక్తి హనుమంతుడి వేషం వేసి అలరించాడు.
అమృత్‌సర్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో పూజలు
కర్ణాటకలోని సంగమేశ్వర ఆలయంలో భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడిన భక్తులు.
గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో అధికారుల ఏర్పాట్లు.
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం ముందు ఏర్పాట్లు.
దేశంలోని పలు దేవాలయాల్లో ఏర్పాట్లు..