తమపై దాడి చేస్తుందన్న భయంతో.. చిరుతను చంపేసిన గ్రామస్థులు
- అసోంలోని గువాహటి శివారు ప్రాంతంలో ఘటన
- అధికారులు చిరుతను పట్టుకోవడంలో ఆలస్యం చేశారని ఆరోపణ
- ఆరుగురి అరెస్టు.. మరికొంత మందికోసం గాలింపు
అసోంలోని గువాహటి శివారు ప్రాంతంలో ఓ చిరుతను స్థానికులు కొట్టి చంపేయడమే కాకుండా, దాన్ని ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చిరుతను చంపేశారన్న విషయం అటవీశాఖ అధికారులకు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు పాల్పడిన మిగతావారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. నిన్న ఉదయం ఆ చిరుత తమ గ్రామంలోకి ప్రవేశించడంతో అది తమపై దాడి చేస్తుందన్న భయంతో స్థానికులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసినప్పటికీ వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. అధికారులు చిరుతను పట్టుకోవడంలో ఆలస్యం చేశారని, అందుకే దాని మీద భయంతో ఈ పని చేశామని గ్రామస్థులు తెలిపారు.