రెండు వారాల్లో జమ్మూకశ్మీర్‌లో 9 భారీ ఆపరేషన్లు.. మొత్తం 22 మంది ఉగ్రవాదుల హతం
- నిన్న, ఈ రోజు కలిపి మొత్తం తొమ్మిది మంది హతం
- అందరూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులే
- భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
ఉగ్రవాదులను అంతమొందించడానికి జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు జరుపుతోన్న ఆపరేషన్‌లో అతి పెద్ద విజయం సాధించారు. నిన్న, ఈ రోజు కలిపి మొత్తం తొమ్మిది మంది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఈ రోజు ప్రకటించారు. నిన్న రేబాన్ ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ఈ రోజు పింజోరాలో నలుగురు ముష్కరులను హతమార్చినట్లు తెలిపారు.
రెండు వారాల్లో తొమ్మిది భారీ ఆపరేషన్లు చేపట్టి మొత్తం 22 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వివరించారు. వారిలో ఆరుగురు ఉగ్రవాద అగ్రశేణి కమాండర్లు ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.