అమెరికాలో మరో నల్లజాతీయుడిపై పోలీసు దాడి.. ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ ఆక్రందన!
- వర్జీనియాలో ఘటన
- కిందపడేసి కొట్టిన వైనం
- మెడపై మోకాలు పెట్టి హింసించిన పోలీసు
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఆఫ్రో అమెరికన్ మరణానికి ఓ శ్వేత జాతీయుడైన పోలీసు కారకుడైన ఘటనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతోన్న సంగతి విదితమే. ఇదే సమయంలో ఆ దేశంలో మరోసారి ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీలో నల్లజాతీయుడిపై ఓ పోలీసు అమానవీయంగా ప్రవర్తించిన తీరు విస్మయం కలిగిస్తోంది.
నల్లజాతీయుడిపై వర్జీనియా పోలీసు తుపాకీ గురిపెట్టి అతడిని కిందపడేశాడు. అనంతరం మెడపై మోకాలు పెట్టి హింసించాడు. జార్జ్ ఫ్లాయిడ్ మాదిరిగానే ఇతడు కూడా ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ అరిచాడు. అయినప్పటికీ పోలీసు అతడిని విడిచిపెట్టలేదు. చివరకు అతడు గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి. దీంతో ఆ పోలీసుపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.