అమెరికా దారిలో బ్రెజిల్.. డబ్ల్యూహెచ్‌వోతో తెగదెంపులు చేసుకుంటామన్న బ్రెజిల్ అధ్యక్షుడు
- డబ్ల్యూహెచ్‌వో రాజకీయాలు చేస్తోందన్న జైర్ బోల్సెనారో
- నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్య
- 2019 నుంచి డబ్ల్యూహెచ్‌వోకు బ్రెజిల్ ఆర్థిక సాయం కట్
కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జాప్యం చేసిందంటూ పలు దేశాలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ సంస్థకు అమెరికా నిధులు ఆపేసింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వోతో తాము కూడా సంబంధాలు తెంచుకుంటామని తాజాగా బ్రెజిల్ హెచ్చరించింది.
ఆ సంస్థ రాజకీయాలు చేస్తోందని, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సెనారో మండిపడ్డారు. కాగా, 2019 నుంచి డబ్ల్యూహెచ్‌వోకు బ్రెజిల్ ఆర్థిక సాయం చేయడం మానేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,90,000 మందికి కరోనా సోకింది.