బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణ, ఉత్తరాంధ్రకు భారీవర్ష సూచన

  • రాగల 48 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం
  • భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం
రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఆపై, రాగల 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడుతుందని వివరించింది.

దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 9 నుంచి 11 వరకు తెలంగాణ, ఉత్తర కోస్తా, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, జూన్ 10 నుంచి 11 వరకు విదర్భ, పశ్చిమ బెంగాల్ లోని గంగానదీ పరివాహక ప్రాంతం, గుజరాత్ లో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ట్విట్టర్ లో తెలిపింది.


More Telugu News