కరోనా ఎఫెక్ట్: ఏయూలో హాస్టళ్లు ఖాళీ చేయాలంటూ విద్యార్థులకు ఆదేశాలు
- విశాఖలో కరోనా ప్రభావం
- హాస్టల్ భవనాలను క్వారంటైన్ కేంద్రాలు మలిచేందుకు ప్రయత్నం
- హాస్టళ్లను వీడుతున్న విద్యార్థులు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింతగా విస్తరిస్తోంది. ఏపీలో ప్రశాంతమైన నగరంగా పేరుగాంచిన విశాఖపట్నం కూడా కరోనాతో సతమతమవుతోంది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం వంటి కారణాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక్కడి ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దాంతో ఏయూ అధికారులు హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ విద్యార్థులను ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో విద్యార్థులు తమ హాస్టళ్లను వీడుతున్నారు. కేసులు ఎక్కువయ్యే క్రమంలో ఈ భవనాలు క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.