సోనూ సూద్ కు హారతి పట్టిన తమిళ మహిళలు
- వలస కార్మికుల దేవుడిగా అవతరించిన సోనూ సూద్
- సొంత ఖర్చులతో కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్న నటుడు
- తాజాగా ముంబయి నుంచి చెన్నైకి బస్సులు
ప్రముఖ నటుడు సోనూ సూద్ సినిమాల కంటే వలస కార్మికుల తరలింపుతోనే ఎక్కువ పాప్యులారిటీ సంపాదించుకున్నారంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించే సోనూ సూద్ ముంబయిలోని తన ఫైవ్ స్టార్ హోటల్ ను కరోనా బాధితుల కోసం ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోయింది. అక్కడ్నించి ఆయన ఏంచేసినా ప్రజలు, మీడియా నీరాజనాలు పలికారు. తాజాగా, ముంబయిలో చిక్కుకున్న అనేకమంది తమిళులను విమానంలో పంపాలని సోనూ సూద్ భావించారు. అయితే అందుకు అనుమతి రాకపోవడంతో వారిని బస్సుల్లో పంపాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఓ బస్సు ముంబయి నుంచి చెన్నై బయల్దేరుతుండగా, కొందరు తమిళ మహిళలు సోనూసూద్ కు హారతి పట్టారు. ఆయన కూడా వారు క్షేమంగా స్వస్థలాలకు చేరాలని కోరుకుంటూ బస్సు ఎదుట కొబ్బరికాయ కొట్టారు. ఏదేమైనా ఎల్లలులేని కారుణ్యం ప్రదర్శిస్తూ సోనూ సూద్ నిర్భాగ్యుల పాలిట ఆశాదీపంలా అవతరించారు.