అసలేమిటీ యాంటీఫా..? ట్రంప్ ఎందుకు ఆందోళన చెందుతున్నారు..?
- ఓ పోలీసు అధికారి కారణంగా జార్జ్ ఫ్లాయిడ్ మృతి
- నిరసన జ్వాలల్లో అమెరికా
- నిరసనలకు యాంటీఫానే కారణమని నమ్ముతున్న ట్రంప్
కరోనాతో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ పోలీసు అధికారి మూర్ఖత్వం కారణంగా ఫ్లాయిడ్ మరణించడాన్ని అక్కడి నల్లజాతీయుల సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దాంతో కొన్నిరోజులుగా అమెరికాలో జాత్యహంకారాన్ని నిరసిస్తూ భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అయితే, ఈ ఆందోళనలు, నిరసన ప్రదర్శనల్లో పూర్తిగా నల్ల దుస్తుల్లో ఉన్నవారు కొందరు కనిపిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ నల్లదుస్తుల్లో నిరసనకారులపై ఓ కన్నేశారు. అసలు ఈ నల్లదుస్తుల్లో ఉన్నవాళ్లెవరో తెలుసుకోవాలంటే యాంటీఫా గురించి తెలుసుకోవాలి.
యాంటీఫా అనేది యాంటీ ఫాసిస్ట్ అనే పదానికి సంక్షిప్తనామం. నియంతృత్వానికి వ్యతిరేకం అని దీనర్థం. ఇది 1930లో ఓ ఉద్యమంలా ఉద్భవించింది. నాడు జర్మనీలో నాజీలకు వ్యతిరేకంగా పుడితే, నేడు అమెరికాలో శ్వేతజాతి దురహంకారాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేస్తోంది. ఇది ఒక వ్యవస్థీకృత సంస్థ కాదు. దీనికొక సంస్థాగత రూపమంటూ లేదు. ఇది ఒక వ్యక్తుల సమూహం. ఒకే రకం భావజాలమున్న వ్యక్తుల కలయికే నేటి యాంటీఫా.
ఇటీవల కాలంలో యాంటీఫా అమెరికాలో మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. అనేక నిరసనలు, ఆందోళనల్లో పాల్గొంటోంది. వీరు పాల్గొన్న ఏ నిరసన ప్రదర్శన అయినా హింసాత్మకంగా మారుతుందని ప్రచారంలో ఉంది. పోలీసులను శత్రువులుగా పరిగణిస్తూ, ఇతర సంప్రదాయ గ్రూపులతో విభేదిస్తూ సాగే యాంటీఫా ఉద్యమకారులు పలు సందర్భాల్లో మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్టు దాఖలాలున్నాయి.
ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం అమెరికాలో జరుగుతున్న అల్లర్ల వెనుక యాంటీఫా ఉందని ట్రంప్ అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వైట్ హౌస్ ఎదుట ఆందోళనలకు దిగిందీ, తాను బంకర్ లోకి వెళ్లడానికి కారణమైందీ యాంటీఫానే అన్నది ట్రంప్ నమ్మకం. త్వరలోనే యాంటీఫాపై ఉగ్రసంస్థ అని ముద్రవేయబోతున్నాం అంటూ ట్రంప్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో అధ్యక్ష ఎన్నికలు రానుండడమే అందుకు కారణం. యాంటీఫాను ఇప్పుడే నియంత్రించకపోతే మున్ముందు ఎన్నికల వేళ ప్రతిబంధకంగా మారొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. యాంటీఫా ముసుగులో దుండగులు, దోపిడీదారులు చెలరేగిపోతున్నారని వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయితే, యాంటీఫా ఓ సంస్థ కాకపోవడంతో దీనిపై చర్యలు ఎలా తీసుకుంటారన్నదానిపై అమెరికా అధికార వర్గాల్లో సందిగ్దత నెలకొంది. అమెరికా చట్టాల ప్రకారం యాంటీఫాపై చర్యలు ఎలా తీసుకోవచ్చన్నదానిపై అక్కడి యంత్రాంగ్రం తీవ్ర కసరత్తులు చేస్తోంది.