కరోనా ఊపు తగ్గుతోందంటున్న చెన్నై ఐఎంఎస్సీ
- దేశంలో వైరస్ సంక్రమణ వేగంపై అధ్యయనం
- లాక్ డౌన్ కు ముందు సంక్రమణ వేగం 1.83గా ఉందన్న పరిశోధకులు
- ఇప్పుడది 1.22కి తగ్గిందని వెల్లడి
భారత్ లో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై చెన్నైకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) చేపట్టిన అధ్యయనంలో ఆసక్తిర అంశం వెల్లడైంది. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా, కరోనా సంక్రమించే వేగంలో పెరుగుదల లేదని, లాక్ డౌన్ ముందు ఉన్న వేగంతో పోల్చితే ఇప్పుడు ఇంకా తగ్గిందని ఐఎంఎస్సీ వివరించింది.
దేశంలో లాక్ డౌన్ విధించక ముందు కరోనా ఒక వ్యక్తి నుంచి ఇతరులకు సంక్రమించే శాతం 1.83గా ఉందని, ఇప్పుడది 1.22 మాత్రమే ఉందని పరిశోధకులు వెల్లడించారు. అంటే, 100 మంది కరోనా రోగుల నుంచి 183 మందికి వ్యాప్తి చెందుతుందని, ప్రస్తుతం 100 మంది ద్వారా 122 మందికి మాత్రమే సోకుతుందని వివరించారు. సడలింపుల నేపథ్యంలో ప్రజలు బయటికి రావడం ఎక్కువైనా సంక్రమణ వేగంలో పెరుగుదల లేదని తెలిపారు. మొత్తంమీద కరోనా సంక్రమణ వేగం 1 కంటే తక్కువ నమోదైనప్పుడు వైరస్ నిర్మూలన షురూ అయినట్టుగా భావించాలని పేర్కొన్నారు..