గొంతునులిమి భార్యను చంపిన పోలీసు కానిస్టేబుల్
- ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలో ఘటన
- పెన్షన్‌పురం రోడ్లపై కత్తి పట్టుకుని కానిస్టేబుల్ హల్‌చల్
- అనంతరం ఇంటికెళ్లి భార్యను చంపిన వైనం
- అతడి ప్రవర్తనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం గ్రామం పెన్షన్‌పురం కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే అయూబ్‌ఖాన్(40) ఎంజీఎం ఆసుపత్రిలో కోర్టు డ్యూటీ చేస్తున్నాడు.
నిన్న పెన్షన్‌పురం రోడ్లపై కత్తి పట్టుకుని హల్‌చల్ చేశాడు. టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌లోకి వెళ్లి వీరంగం సృష్టించగా ఆయనను అక్కడి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసు స్టేషన్ నుంచి ఆయనను భార్య తస్లీమా సుల్తానాతో పాటు బంధువులు కలిసి విడిపించి ఇంటికి తీసుకెళ్లారు.
ఇంటికి వెళ్లిన అయూబ్ ఖాన్ తన భార్య తస్లీమా గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మళ్లీ రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేశాడు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఎందుకిలా ప్రవర్తించాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు. తానే తన భార్యను హత్య చేశానని ఒప్పుకున్నాడు.