యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియోను చూశారా? ఇదిగో ఇదే..!

  • 2005 వాలెంటైన్స్ రోజున ప్రారంభమైన యూట్యూబ్
  • ఆపై ఏప్రిల్ 24న 18 సెకన్ల నిడివితో వీడియో
  • ఇప్పటికే 9.7 కోట్ల వీక్షణలు
ఆన్ లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ గురించి తెలియని వారే ఉండరు. ఎవరికి ఎటువంటి వీడియో కావాల్సి వచ్చినా, ముందు వెతికేది యూట్యూబ్ లోనేననడంలో సందేహం లేదు. గూగుల్, ఫేస్ బుక్ తరువాత నెటిజన్లు అత్యంత ఆసక్తిని చూపించేది గూగుల్ పైనే. అంతేకాదు. ఇంటర్నెట్ వినియోగంలో మూడింట  రెండు  వంతుల భాగం యూట్యూబ్ ను చూసేందుకే నెటిజన్లు వెచ్చిస్తున్నారట.

ఇక యూట్యూబ్ ను 2005లో ప్రారంభించారని, ఏడాది తిరక్కుండానే దాన్ని గూగుల్ కొనుగోలు చేసిందన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ, యూట్యూబ్ లో పోస్ట్ చేయబడిన తొలి వీడియో ఎవరిదో తెలుసా? దాన్ని ఎప్పుడైనా చూశారా?

2005 వాలెంటైన్స్ రోజున, అంటే... ఫిబ్రవరి 14న స్టీవ్ చెన్, చాద్ హర్లే, జావేద్ కరీమ్ లు యూట్యూబ్ ను ప్రారంభించారు. ఆపై అదే సంవత్సరం ఏప్రిల్ 24న 'మీ ఎట్ జూ' పేరిట తొలి వీడియో అప్ లోడ్ అయింది. ఓ శాన్ డియాగోకు చెందిన ఓ యువకుడు 18 సెకన్ల నిడివి వున్న వీడియోను పోస్ట్ చేశాడు. దీనిలో అతను ఏనుగుల గురించి వివరించాడు. ఈ వీడియోను ఇప్పటివరకూ 9.7 కోట్ల మంది చూడగా, 63 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. యూట్యూబ్ తొలి వీడియోను మీరూ చూసేయండి. 


More Telugu News