టీటీడీపై హీరో సూర్య తండ్రి సంచలన ఆరోపణలు... కేసు నమోదు!

  • ధనవంతులకు మాత్రమే దర్శనాలు
  • మామూలు జనాలను తోసేస్తారు
  • అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానంపై సంచలన ఆరోపణలు చేసిన తమిళ సూపర్ స్టార్ సూర్య తండ్రి శివకుమార్ పై కేసు నమోదైంది. తిరుమలలో కేవలం ధనవంతులకు మాత్రమే దర్శనాలు లభిస్తాయని, వారికే గెస్ట్ హౌస్ లను ఇస్తారని, మామూలు జనాలను తోసేస్తారని శివకుమార్ వ్యాఖ్యానించారు. అటువంటి ఆలయానికి ప్రజలు ఎందుకు వెళ్లాలని కూడా ప్రశ్నించారు. దీనిపై తమిళ మయ్యన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా శివకుమార్ తప్పుడు ప్రచారం చేశారని మయ్యన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. 

కాగా, లాక్ డౌన్ కారణంగా తిరుమలలో దర్శనాలు నిలిచిన తరువాత సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు దుష్ప్రచారం ప్రారంభించాయి. వీటిపై దృష్టిని సారించిన టీటీడీ అధికారులు, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం శివకుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సైతం ఈ తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టి కేసులు పెట్టేందుకు నిమగ్నమైంది.


More Telugu News