రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం

  • జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో నిర్వహించుకోవచ్చన్న కోర్టు
  • ఆచరణలో కష్టసాధ్యమని భావించిన తెలంగాణ సర్కారు
  • అన్ని జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ సర్కారు పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతకుముందు, ఈ విషయమై హైకోర్టులో విచారణ జరగ్గా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని ధర్మాసనం సూచించింది. అయితే, ఇది ఆచరణలో కష్టసాధ్యమని భావించిన తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.


More Telugu News