ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టిన టిక్ టాక్ స్టార్ పై కేసు నమోదు
- టిక్ టాక్ వీడియోలతో ప్రజాదరణ పొందిన సోనాలీ ఫోగట్
- మార్కెట్ కార్యదర్శితో ఘర్షణ
- కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్న ఎస్పీ
హర్యానాకు చెందిన సోనాలీ ఫోగట్ టిక్ టాక్ వీడియోలతో ఎంతో పాప్యులారిటీ సంపాదించింది. స్థానిక బీజేపీ నేతగానూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఓ ప్రభుత్వాధికారిని సోనాలీ చెప్పుతో కొడుతున్న వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు చిక్కుల్లో పడింది. దీనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల సోనాలీ బాలాస్మంద్ ప్రాంతంలోని ఓ వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించేందుకు వెళ్లగా, అక్కడి మార్కెట్ సెక్రటరీ సుల్తాన్ సింగ్ తో ఆమె ఘర్షణ పడడమే కాదు, అతడ్ని చెప్పుతో ఇష్టంవచ్చినట్టు కొట్టారు. ఈ నేపథ్యంలో, సుల్తాన్ సింగ్ ఫిర్యాదు చేశారని, దాంతో సోనాలీపై కేసు నమోదు చేశామని హిస్సార్ ఎస్పీ గంగారామ్ పునియా వెల్లడించారు. ప్రభుత్వ అధికారిని సోనాలీ అవమానించినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.